సింహాచలంలో చందనం అరగదీత ప్రారంభం.. మే 3న అప్పన్న నిజరూపదర్శనం..

సింహాచలంలో చందనం అరగదీత ప్రారంభం.. మే 3న అప్పన్న నిజరూపదర్శనం..

సింహాచలం : సింహాచలంలో కొలువున్న శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామికి ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. ఏడాది పొడువునా చందనంతో కప్పి ఉండే స్వామివారు ఈ ఒక్క రోజు మాత్రం నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున స్వామివారి నిజరూపాన్ని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు సింహగిరికి తరలివస్తారు. సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈ సంవత్సరం మే 3న అప్పన్న నిజరూపదర్శనం ఉత్సవం నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా సుగంధభరిత చందనంలో ఉండే స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే భక్తులకు తన నిజరూపదర్శనం గావిస్తారు. దీనినే భక్తులంతా చందనయాత్రగా, చందనోత్సవంగా పిలవడం జరుగుతుంది. కరోనా కారణంగా రెండేళ్లు తరువాత చందనోత్సవంకు భక్తులను అనుమతించడంతో ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు హాజరు కానున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక ఈనెల 26న ఏకాదశిపర్వదనం సందర్భంగా అప్పన్న ఆలయంలో శాస్త్రోక్తంగా చందనం అరగదీత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆ రోజు తెల్లవారు జామున ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ బేడా మండపంలో చందనం చెక్కలతో ప్రదక్షిణలు నిర్వహిస్తారు.
తొలివిడతగా అరగదీసిన చందనాన్ని స్వామి పాదాల ముందు ఉంచి ప్రత్యేక అర్చన గావిస్తారు. తొలివిడతలో మూడు మణుగుల చందనం (125 కేజీలు) సిద్ధం చేసి వాటిలో సుగంద ద్రవ్యాలు మిలితం చేసి ఆలయ బాండాగారంలో భద్రపరుస్తారు. మే 3న నిజరూపదర్శనం అనంతరం రాత్రికి వివిధరకాల ఫల, పుష్ప, శీతలాదులతో కూడిన సహస్రఘటాభిషేకం కనుల పండువుగా జరిపించి అదే రోజు రాత్రికి మూడు మణుగుల చందనాన్ని స్వామికి శాస్త్రోక్తంగా సమర్పిస్తారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0