ఫాన్స్ నుంచి సెలబ్రిటీల వరకు.. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ నామస్మరణే!

ఫాన్స్ నుంచి సెలబ్రిటీల వరకు.. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ నామస్మరణే!

రాజమౌళి- జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన RRR(రైజ్-రోర్-రివోల్ట్.. రౌద్రం.. రణం.. రుధిరం) మూవీ ఫస్ట్ రివ్యూ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. కోట్లాది మంది రివ్యూ కోసం ఎదురుచూడకుండా.. సినిమాను నేరుగా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఎక్కడ చూసినా ట్రిపుల్ఆర్ మ్యానియానే కనిపిస్తోంది. ఫాన్స్ దగ్గరనుంచి సెలబ్రిటీల వరకూ ట్రిపుల్ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ట్రిపుల్ఆర్ గ్రాండ్ నెస్ అలాంటిది మరి. బడ్జెట్ దగ్గరనుంచి స్టార్ కాస్ట్, మేకింగ్, ప్రమోషన్స్ ఇలా సినిమాలో ఏ విషయం గురించి మాట్లాడినా.. ఫస్ట్ ఆ గ్రాండియరే కనిపిస్తోంది. ట్రిపుల్ఆఱ్.. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనడానికి అసలు ఈ సినిమాలో ఏమున్నాయో లెట్స్ హ్యావ్ ఎ లుక్.
బాహుబలితో టాలీవుడ్ స్టామినాను నేషన్ వైడ్ గా పరిచయం చేసిన రాజమౌళి.. ఇప్పుడు ట్రిపుల్ఆర్ ని ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా తీర్చిదిద్దేందుకు డిసైడ్ అయ్యారు. సినిమాలో ప్రతీదీ ఇంటర్నేషన్ స్టాండర్డ్స్ కి రీచ్ అయ్యేలా గ్రాండ్ గా ట్రిపుల్ఆర్ ని తెరకెక్కించారు. 500కోట్ల బడ్జెట్.. అసలు ఇప్పటి వరకూ ఇండియన్ హిస్టరీలోనే ఇంత బడ్జెట్ తో ఏ సినిమా తెరకెక్కలేదు. అలాంటిది ఒక తెలుగు డైరెక్టర్ తన బిగ్ డ్రీమ్ ని వరల్డ్ వైడ్ కాన్వాస్ మీద ట్రిపుల్ఆఱ్ గా చూపించడబోతున్నారు. 350 కోట్లు ఓన్లీ మేకింగ్ కోసమే స్పెండ్ చేశారంటే.. ఏ రేంజ్ లో సినిమాని చూపించబోతున్నారో తెలుస్తోంది.
3 వేల మంది టెక్నీషియన్లు, 10 మంది కో డైరెక్టర్ల తో నెవర్ బిఫోర్ క్రూ తో తెరకెక్కించిన ఈ గ్రాండ్ మూవీ బిజినెస్ కూడా అదే రేంజ్ లో చేసింది. ఇప్పటికే 450 కోట్లకు ప్రీ రిలీజ్ చేసుకున్న ట్రిపుల్ ఆర్.. వరల్డ్ వైడ్ గా 11 వేల ధియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు మూవీగా రికార్డ్ క్రియేట్ చేస్తోంది ట్రిపుల్ ఆర్. ఒక్క అమెరికాలోనే 1150 లొకేషన్స్ లో 2500లకు పైగా ధియేటర్లలో రిలీజ్ అవుతోంది ఈ భారీ బడ్జెట్ మూవీ.

What's Your Reaction?

like
0
dislike
0
love
2
funny
0
angry
0
sad
0
wow
0