గోమాత ను ఢీకొన్న లారీ.. మానవత్వాన్ని చూపించిన హెడ్ కానిస్టేబుల్

గోమాత ను ఢీకొన్న లారీ.. మానవత్వాన్ని చూపించిన హెడ్ కానిస్టేబుల్

సత్తెనపల్లి, ఆగస్టు 30 (ఇండియాజ్యోతి) : సత్తెనపల్లి పట్టణ తాలుకా సెంటర్ లో సోమవారం ఆవుదూడను అటుగా వెళ్తున్న కోళ్ల ఫారం లారీ తగలటంతో కాలికి తీవ్ర గాయమైంది.  దీంతో అది కదలలేక నడి రోడ్డుపై పడిపోయినట్లు స్థానికులు అక్కడ విధి నిర్వహణలో ఉన్న పట్టణ హెడ్ కానిస్టేబుల్ రవి కుమార్ కు తెలిపారు. వెంటనే ఆ కానిస్టేబుల్ హుటాహుటిన అక్కడకు చేరుకొని అందుబాటులో ఉన్న మరో కానిస్టేబుల్ ను పశు వైద్య శాలకు పంపించి వైద్యుడిని పిలిపించారు. డాక్టర్ ఆ ఆవుదూడకు సత్వర చికిత్స చేసి కట్టుకట్టారు. అనంతరం ఆవుదూడను రిక్షాలో ఎక్కించి యజమాని ఇంటికి సురక్షితంగా పంపించారు. ఈ సందర్బంగా ఆవు యజమాని, 21 వ వార్డ్, డొంక రోడ్డుకు చెందిన షేక్.మహబూబ్ సుబానినీ పిలిపించి ఆవులను ఇలా రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళటం మంచి పద్దతి కాదని హెచ్చరించారు ట్రాఫిక్ ఇంచార్జ్ రవి. కాగా ఈ సంఘటన పట్ల తక్షణమే స్పందించి, సకాలంలో ఆవు దూడ కు వైద్యం చేయించి మానవసత్వాన్ని చాటిన హెడ్ కానిస్టేబుల్ రవి కుమార్ ను స్థానిక ప్రజలు అభినందించారు. 

What's Your Reaction?

like
1
dislike
0
love
0
funny
0
angry
1
sad
0
wow
0