అమరావతి రైతులు పాదయాత్రకుఅనుమతినిచ్చిన హైకోర్టు..

అమరావతి రైతులు పాదయాత్రకుఅనుమతినిచ్చిన హైకోర్టు..

అమరావతి ఉద్యమాన్ని మరింత విస్తృతం చేసే క్రమంలో రాజధాని రైతులు మహా పాదయాత్రకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అమరావతి పరిరక్షణ సమితితో కలిసి ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో 45 రోజుల పాటు మహా పాదయాత్ర చేపట్టాలని భావించారు. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఈ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే డీజీపీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతులు హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని శుక్రవారం విచారించిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం షరతులతో పాదయాత్రకు అనుమతిచ్చింది.

ఈ సందర్భంగా ‘రైతుల పాదయాత్రతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. గ్రామాల్లోకి వెళ్లినప్పుడు రైతులపై రాళ్లు విసిరే ప్రమాదం ఉంది’ అని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించగా..’రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటారని.. ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవు’ అని రైతుల తరఫున లక్ష్మీ నారాయణ వాదనలు వినిపించారు. ఇద్దరి వాదనలు విన్న హైకోర్టు పాదయాత్రకు అనుమతిస్తే పోలీసులు, ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించింది. అనంతరం రైతుల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0