కొండెక్కి కూర్చున్న చికెన్ ధర..! కేజీ ధర ఎంతంటే..?

కొండెక్కి  కూర్చున్న చికెన్ ధర..! కేజీ ధర ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.  చికెన్ తినే వారి సంఖ్య పెరుగుతుండటంతో చికెన్ షాపుల వద్ద కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. ఇదిలావుంటే, ఇవాళ ఆదివారం కావడంతో చికెన్  కొందామని చికెన్ షాపులకువెళ్లిన వారు ధరను చూసి షాకవుతున్నారు. కేజీ చికెన్ ధర రూ.300లకు పైగా ఉండటంతో.. కేజీ  కొనేవారుఅరకేజీతో సరిపెడుతున్నారు. అటు ఇప్పటికే పెరిగిన ఆయిల్, కూరగాయలు, పప్పుల ధరలతో అల్లాడుతున్నామని.. చికెన్ ధర కూడా మండుతుంటే ఎలా అని మాంసం ప్రియులు ఆవేదన చెందుతున్నారు. అటు ధరలు ఇప్పట్లో తగ్గవని, త్వరలోనే 400 వరకు చికెన్ రేటు పెరుగుతుందని వ్యాపారులు చెబుతుండటం గమనార్హం. 

What's Your Reaction?

like
1
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0