భారత్ లో 40కి చేరిన ఓమిక్రాన్ కేసులు.. నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం

భారత్ లో 40కి చేరిన ఓమిక్రాన్ కేసులు.. నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం

భారత్ దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. అదేవిధంగా ప్రజల్లో భయం కూడా పెరుగుతుంది, ఈ వేరియంట్ అతి వేగంగా వ్యాపిస్తున్న కారణంగా కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని తెలిపింది,  పలు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు పెరుగుతుండటంతో మాస్క్ తప్పనిసరి చేయాలని, క్రౌడ్‌ను తగ్గించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. అంతేకాదు, అవసరమైతే నైట్ కర్ఫ్యూ విధించాలని స్పష్టం చేసింది. తాజాగా మహారాష్ట్రలో మరో కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 40కి చేరింది. మహారాష్ట్రలో కొత్త రెండు కేసులు కలిపి మొత్తం 20 కేసులు నమోదయ్యాయి. పూణే, లాతూర్‌లో రెండు కేసులు నమోదైనట్టు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో మొత్తం 20 కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు మొదులుపెట్టింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
1
wow
0