నరసరావుపేటలో గర్భిణీ మరియు సాధారణ స్త్రీలకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న హిమబిందు మెటర్నిటి & ఫెర్టిలిటీ హాస్పిటల్
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కలెక్టర్ ఆఫీస్ రోడ్, నవోదయ నగర్ లో , చెరుకూరి హాస్పిటల్ వద్ద ఉన్న హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు మరియు సాధారణ స్త్రీలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తుంది. తమ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని హాస్పిటల్ అధినేత, స్త్రీల ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు డాక్టర్ రాధిప్రియ చెరుకూరి అన్నారు. శనివారం ఆమె 'ఇండియా జ్యోతి న్యూస్ ఛానల్' తో మాట్లాడారు. తమ హాస్పిటల్ నందు అడ్వాన్సుడ్ ఐసీయూ , ఆపరేషన్ థియేటర్, లేపరోస్కోపీ మిషన్ మరియు హిస్టిరోస్కోపీ తదితర సౌకర్యాలు ఉన్నాయన్నారు. గర్భిణీ స్త్రీలకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ, నొప్పిలేని సాధారణ కాన్పులు, సిజేరియన్ ఆపరేషన్లు, గర్భసంచి ఆపరేషన్, వి బ్యాక్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంకా గర్భిణీ స్త్రీలకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, పరీక్షలు తమ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయన్నారు. కాబట్టి పల్నాడు ప్రాంతంలో వున్న గర్భిణీ స్త్రీలే కాకుండా, సాధారణ స్త్రీలు కూడా తమ ఇతర సమస్యలకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని డాక్టర్ రాధిప్రియ చెరుకూరి తెలిపారు.