హైదరాబాద్‌లో చెడ్డిగ్యాంగ్‌ హాల్‌చల్‌.. 

హైదరాబాద్‌లో చెడ్డిగ్యాంగ్‌ హాల్‌చల్‌.. 

నగరంలోకి మళ్లీ చడ్డీ గ్యాంగ్ వచ్చేసింది. హైదరాబాద్ నగర శివార్లలో చెడ్డీగ్యాంగ్‌ భారీ చోరీలకు పాల్పడింది. హయత్‌నగర్‌లోని కుంట్లూరు ప్రజయ్‌ గుల్మహార్‌ గేటెడ్‌ కమ్యూనిటీలోని 4 ఇళ్లలో చోరీ చేశారు. విలియంసన్ అనే వ్యక్తి ఇంట్లో 7.5 తులాల బంగారం, 80 తులాల వెండి, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. చడ్డీ గ్యాంగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇందుకోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.

What's Your Reaction?

like
1
dislike
0
love
0
funny
1
angry
1
sad
0
wow
0