సూప్‌ తాగితే బరువు తగ్గుతారా..?

సూప్‌ తాగితే బరువు తగ్గుతారా..?

బరువు తగ్గడానికి ఆహారం తినడం మానేయడం, డైటింగ్‌ చేయడం వంటివి చాలా మంది చేస్తుంటారు. అలా కడుపు మాడ్చుకోనవసరం లేదు. మంచి పౌష్టికాహారం తీసుకొని హాయిగా బరువు తగ్గించుకోవచ్చు. ఊబయ కాయం నుండి నాజూగ్గా తయాం వ్వాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించడం ముఖ్యం. అటువంటి ఆరోగ్య సూత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


మనలో చాలా మందికి సూప్‌ త్రాగే అలవాటుంది. స్థూల కాయం ఉన్న ప్రతి ఒక్కరు సూప్‌ త్రాగడానికి అలవాటుపడితే మంచిది. ప్రతి రోజు భోజనం చేసే ముందు సూప్‌ తాగితే సంవత్సరంలో మీరు పెరిగే బరువులో 7 కిలోల బరువు తగ్గిపోతారట. ప్రతి ఒక్కరు సూప్‌ త్రాగడం అలవాటు చేసుకుంటే స్థూలకాయం నుండి దూరం కావచ్చు. టమోటో లాంటి వెజిటబుల్‌ సూప్‌ త్రాగితే చాలా మంచిది అని నిపుణులు చెపుతున్నారు.
ఆరోగ్య సూత్రాలు పాటించే వారు మొదట చేసేది ఆయిల్‌ తగ్గించడం. ఆలివ్‌ ఆయిల్‌ అలవాటు చేసి సాధారణంగా ఉపయోగించే ఆయిల్‌ను దూరం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆలివ్‌ ఆయిల్లో మ్యూఫా చాలా ఉంటాయి. మ్యూఫా అంటే మోనో శాచ్యురేటడ్‌ ఫ్యాట్‌ అని అర్ధం. ఇవి శరీరంలోని నుంచి కొలెస్ట్రాల్‌ను తగ్గించకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఈ విధంగా గుండె జబ్బులు దూరం అవుతాయి. గుండె పదిలంగా ఉంటుంది.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
1
sad
0
wow
0