సీఎం జగన్ కు ప్రధాని ఫోన్.. ఆదుకుంటామని హామీ..

సీఎం జగన్ కు ప్రధాని ఫోన్.. ఆదుకుంటామని హామీ..

వాయుగుండం కారణంగా ఏపీలో గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా కడప , చిత్తూరు , నెల్లూరు జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ వర్షాలకు భారీగా ఆస్థి , ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ప్రధాని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఫోన్ చేసారు. వర్షాల తీవ్రత ఫై ఆరా తీశారు. కొనసాగుతున్న సహాయక చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అన్ని విధాలుగా సాయమందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

ఇక వాయుగుండం విషయానికి వస్తే..ఉత్తర తమిళనాడు తీరం వెంబడి ఉన్న వాయుగుండము పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి.. ఇవాళ ఉత్తర తమిళనాడు వద్ద 12.7 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79.9 తూర్పు రేఖాంశం వద్ద, వెల్లూర్‌కు తూర్పు ఆగ్నేయంగా 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు మీద ఉన్న వాయుగుండానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి అంతర్గత ఒడిశా వరకు, కోస్తాంధ్ర తీరం మీదుగా ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపారు.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

What's Your Reaction?

like
1
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0