వైశాఖ పౌర్ణమి సందర్బంగా తిరుమల మాడవీధుల్లో.. ఘనంగా ముగిసిన 'శ్రీవారి గరుడ సేవ'..  

వైశాఖ పౌర్ణమి సందర్బంగా తిరుమల మాడవీధుల్లో.. ఘనంగా ముగిసిన 'శ్రీవారి గరుడ సేవ'..  

వేద స్వరూపుడైన గరుత్మంతుడు వైధికములైన సామాధులకు ప్రతిరూపాలైన అంగ ప్రత్యాగాలు కలవాడు. శ్రీ మహావిష్ణువు గరుడ సమ్మేళనం, వేదం స్వరూప శీర్షాలుగా తెలుస్తుంది. దాసుడిగా, మిత్రుడిగా, విసనకర్రగా, ఆసనంగా, అవాసంగా, ధ్వజంగా అనేక విధాలుగా గరుత్మంతుడు శ్రీనివాసుడిని సేవిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సమయంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడి.    

తిరుమల : శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి వైశాఖ పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు గరుడునిపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శన మిచ్చారు. చిరుజల్లులు కురుస్తుండడంతో ఘటాటోపంతో వాహన సేవ జరిగింది. భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. 

గరుడ వాహనం సర్వపాప ప్రాయశ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడనని తెలియచెబుతారు. అంతే కాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియ చెబుతున్నాడు. ఈ కార్యక్రమంలో టిటిడి పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆలయ డిప్యూటిఈవో రమేష్‌బాబు, వీజివో బాలిరెడ్డి, పేష్కార్‌ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0