వివాహితకు మాయమాటలు చెప్పి లైంగిక దాడి...!

వివాహితకు మాయమాటలు చెప్పి లైంగిక దాడి...!

కాపురాన్ని చక్కదిద్దుతానంటూ ఓ వివాహితకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతమిది. నెల్లూరు నవాబుపేట పోలీసుల కథనం మేరకు. నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళకు 2012లో ఓ వ్యక్తితో వివాహమైంది. మనస్పర్థల నేపథ్యంలో ఏడేళ్ల క్రితం ఆమె భర్త నుంచి విడిపోయి పుట్టింట్లో ఉంటుంది. ఓ గుడికి తరచూ వెళుతోంది. ఈ క్రమంలో మైపాడు గేటు ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఆమె తన పరిస్థితిని అతనికి తెలపగా కాపురాన్ని చక్కదిద్దుతానని నమ్మించాడు. ఆమె గుడి వద్ద ఉండగా శ్రీనివాసులు వెళ్లి ఆమెను అరుణాచలం వీధిలోని ఓ ఇంటికి తీసుకెళ్లాడు. లైంగిక దాడి చేశాడు. రక్తస్రావంతో బాధితురాలు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చేరారు. బాధితురాలు నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0