వివాదంలో ‘ఆచార్య’ సాంగ్

వివాదంలో ‘ఆచార్య’ సాంగ్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. అయితే ఆ పాట ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది.ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్‌ఎంపీ వైద్యుల సంఘం పోలీసులను ఆశ్రయించారు. ‘సనా కష్టం’ అంటూ సాగే ఈ పాటలోని సాహిత్యం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆర్‌ఎంపీ వైద్యుల సంఘం మెమోరాండం జారీ చేసింది. పాటలో ఒకదశలో 'యాడడో నీమరొచ్చని కుర్రాళ్లంతా ఆర్‌ఎంపీలుగా మారుతున్నారు..' అనేది ఆర్‌ఎంపీ డాక్టర్లు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది అని చిత్ర దర్శకుడిపై మరియు పాట రాసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0