విజయవాడ చేరుకున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్... చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు

విజయవాడ చేరుకున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్... చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు

సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.  దేశంలోనే అత్యంత వేగంతో ప్రయాణించే రైలుగా ఈ రైలు నిలిచిపోనుంది. ఈనేపథ్యంలో  వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు విజయవాడ జంక్షన్ కు చేరుకుంది. కాగా ఈ రైలు  సికింద్రాబాద్ నుండి బయలుదేరి  వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడ చేరుకుంది. 

ఈ రైలు రాకతో విజయవాడ స్టేషన్ లో కోలాహలం నెలకొంది. ఈ అత్యాధునిక ట్రైన్ ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ ఫోన్లలో వందేభారత్ రైలు రాకను చిత్రీకరించారు.

ఈ రైలు సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకోనుంది. తెలంగాణలో వరంగల్ ఖమ్మం... ఏపీలో విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కాగా ఈ రైలు వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడ చేరుకుంది. 

ఈ రైలు రాకతో విజయవాడ స్టేషన్ లో కోలాహలం నెలకొంది. ఈ అత్యాధునిక ట్రైన్ ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ ఫోన్లలో వందేభారత్ రైలు రాకను చిత్రీకరించారు. ఈ రైలు భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన ఎనిమిదవ వందే భారత్ ఎక్స్ ప్రెస్, తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ సుమారు 700 కి.మీ మేర ప్రయాణిస్తుంది. 

ఈ రైలు సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకోనుంది. తెలంగాణలో వరంగల్ ఖమ్మం... ఏపీలో విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
1
wow
0