రెండో దోస్ జాప్యమైతే..యాంటి బాడీస్ పెరుగుతాయా ?

రెండో దోస్ జాప్యమైతే..యాంటి బాడీస్ పెరుగుతాయా ?

న్యూఢిల్లీ మే 21 (ఇండియాజ్యోతి) :
 టీకాల సరఫరా సరిగా లేక సతమతమవుతున్న ప్రభుత్వాలకు, ఆ మాటకు వస్తే ప్రజలకు ఇది మంచివార్త. మొదటి టీకా తీసుకున్న తర్వాత రెండో టీకా జాప్యమైతే రోగనిరోధకత లేదా యాంటీబాడీస్ 20 నుంచి 300 శాతం పెరుగుతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనివల్ల ఉభయులకూ ప్రయోజనమే. టీకాలు లేటు చేస్తున్నారనే విమర్శల నుంచి ప్రభుత్వాలు బయటపడవచ్చు. లేటయినా లేటెస్టుగా రక్షణ పొందామని ప్రజలూ తృప్తి పడవచ్చు. పైగా టీకాల మధ్య వ్యవధి పెంచడం వల్ల ఇతరులకు టీకాలు వేసే అవకాశమూ దక్కుతుంది. ఇది మరో ప్రయోజనం. సింగపూర్ విషయమే తీసుకుందాం. కొరత కారణంగా టీకాల మధ్య వ్యవధిని 3-4 వారాల నుంచి 6-8 వారాలకు పెంచింది. దీని ద్వారా ఆగస్టు నాటికి వయోజనులు అందరికి ఆగస్టు చివరినాటికి కనీసం ఒకడోసు పూర్తి చేయాలనే లక్ష్యం సాధించాలని సింగపూర్ చూస్తున్నది. ఒకటి తర్వాత ఒకటి ఇతర దేశాలు కూడా ఈ బాటనే పడుతున్నాయి. మొదటి టీకా వేసుకున్న వారికి రెండో టీకా వేసే బదులు దానిని అసలు టీకా పడనివారికి ఇవ్వడమే మంచిదని మేయో క్లినిక్ వ్యాక్సిన్ పరిశోధన బృందానికి చెందిన గ్రెగరీ పోలండ్ అన్నారు. ప్రపంచం మొత్తంగా తగలబడి పోతున్నది. వీలైనన్ని మంటలు ఆర్పడమే మంచిది అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే 2020లో టీకాల కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు గడువు పెంపు పల్ల కలిగే ప్రయోజనాలపై అంతగా అవగాహన లేదు. ప్రస్తుతం అనేక అధ్యయనాలు ఈ విషయమై కొత్త డేటా అందించడంతో శాస్త్రవేత్తల్లో ధీమా పెరిగింది. ఇది అన్నిరకాల కరోనా టీకాలకు వర్తిస్తుందని అంటున్నారు. సింగపూర్, కెనడాల్లో ఈ తరహా అధ్యయనాలు జరిగాయి.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0