మండి పోతున్న 'ఏపీ'..

మండి పోతున్న 'ఏపీ'..

ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. తీవ్రమైన ఎండలతో ప్రజలు అలమటించి పోతున్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ బుధవారం హెచ్చరిక జారీచేసింది. రోజురోజుకు ఎండలు సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా సామాన్యులు, పేదలు, వృద్దులు తమ పనులకు వెళ్లలేకపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా... మొత్తం 119 కేంద్రాల్లో ఈ అధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు గుర్తించారు. అత్యంత ఎక్కువగా విజయనగరం జిల్లాలోని నెలిమర్లలో41.9 డిగ్రీలు, రాజాంలో 41.8, నంద్యాల జిల్లా అవుకులో 41.6, పల్నాడు జిల్లాలో 42 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. దీనికి తోడు వడగాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
1
wow
0