భూమిలో బంగారం అంటూ బురిడి.. లక్షల రూపాయల దోపిడి..

భూమిలో బంగారం అంటూ బురిడి.. లక్షల రూపాయల దోపిడి..

జోగులాంబ గద్వాల జిల్లా చెందిన వ్యాపారి శ్రీనివాసులుకు కర్ణాటకు చెందిన గుర్తుతెలియని వ్యక్తి
మాయమాటలతో బురిడి కొట్టించాడు. తన పొలంలో బంగారం లభించిందంటూ ఆశ చూపాడు.. ఆ బంగారాన్ని అమ్మిపెట్టాలని లేదంటే తక్కువ ధరకు అమ్ముతున్నాడంటూ బంగారం వ్యాపారికి టోకరా వేశాడు. బంగారం వ్యాపారంలో ఆరితేరిన వ్యక్తి మాయగాడి మాటలు ముందుగా నమ్మలేదు. అయినా ఆ మోసగాడు వెంటపడ్డాడు. ఒక్కసారి వచ్చి బంగారన్ని చూడాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఆ వ్యాపారి ఒకసారి చూసి వస్తే పోయెది ఏమి లేదంటూ కర్ణాటకకు వెళ్లాడు.అయితే చెప్పినట్టుగానే బంగారంతో కూడిన చైన్‌లు కొన్నింటిని కొన్నింటిని చూపించాడు.అయినా నమ్మని బంగారు వ్యాపారి వాటిలో కొన్నింటిని గద్వాలకు తీసుకువచ్చి పరీక్షించాడు. దీంతో అది నిజమైన బంగారంగా నమ్మాడు. ఆ తర్వాత నిందితుడు తన స్కెచ్ అమలు చేశాడు.కర్ణాటకకు చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ ఏడాది జూన్ లో ఫోన్ గద్వాలకు చెందిన శ్రీనివాస్ అనే బంగారం వ్యాపారిని సంప్రదించాడు. మొదట తేలిగ్గా తీసుకున్న శ్రీవాసులు పదే పదే ఫోన్ చేయడంతో చివరికి తన మిత్రుడైన మెకానిక్ గోవర్ధన్ తో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని ప్రాంతంలోని హౌస్ ఫ్రంట్ కు వెళ్ళాడు అక్కడి వ్యక్తి పొలం లో దొరికిన బంగారు చైన్‌లు కొన్ని చూపించాడు.. వెంటనే వాటిని గద్వాలకు తీసుకొచ్చి నిజమైన బంగారం నిర్ధారించుకున్నారు.
దీంతో తాను అరకిలో బంగారం ఇస్తానని అందుకు కోసం రూ 15 లక్షలు తీసుకురావాలని దాన్ని విక్రయించిన తర్వాత బంగారం ఇస్తానని నమ్మబలికాడు. శ్రీనివాస్‌ను దావనగిరి కి రమ్మని చెప్పడంతో నమ్మిన శ్రీనివాసులు తన మిత్రుడు గోవర్ధన్ ‌తో కలిసి మరోసారి వెళ్లారు. అప్పటికే పక్క ప్లాన్ తో తన మిత్రులతో ఉన్న కర్ణాటక వాసి రూ 15 లక్షలు గుంజుకుని ఇద్దరి పై దాడికి పాల్పడ్డాడు. అనంతరం గద్వాలకు వచ్చిన వ్యాపారి శ్రీనివాస్ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
1
angry
0
sad
0
wow
0