పోలీసుల అదుపులో యూట్యూబ్ నటి 'సరయు'..

పోలీసుల అదుపులో యూట్యూబ్ నటి 'సరయు'..

హైదరాబాద్ : యూట్యూబ్ నటి బ్యూటీ ఫేమ్ సరయుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా సరయు వీడియో తీశారంటూ విశ్వహిందూ పరిషత్ నేతలు ఫిర్యాదు చేయడంతో ఆమెను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వీడియోలో నటించారని ఫిర్యాదు అందడంతో బంజారాహిల్స్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన హిందూ సంఘం నాయకుడు అశోక్ కుమార్ ఫిర్యాదు మేరకు సరయుపై కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సరయుపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాగా ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటం గమనార్హం. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
2
angry
1
sad
1
wow
0