నెల్లూరు లో వెలుగుచూసిన ఓ కార్పొరేట్ హాస్పిటల్ దందా..

నెల్లూరు లో వెలుగుచూసిన ఓ కార్పొరేట్ హాస్పిటల్ దందా..

కరోనా పేషెంట్ లకు వైద్యం పేరుతో లక్షలాది రూపాయలు వసూలు
నెల్లూరు
నెల్లూరు నగరంలో మరో సెమీ కార్పొరేట్ హాస్పిటల్ నిర్వాహకం కాసుల కోసం చేసిన దోపిడీ వెలుగుచూసింది. ప్రాణాపాయంలో ఉన్న కరోనా బాధితుల నుంచి లక్షలాది రూపాయలు ముక్కుపిండి వసూలు చేసిన సదరు హాస్పిటల్ బిల్లులు అడిగినందుకు రెచ్చి పోయింది. ఇదేమని అడిగిన కరోనా బాధితుల పై బెదిరింపులు హెచ్చరికలు చేసింది. దీంతో బాధితులు రోడ్డెక్కారు. కార్పొరేట్ హాస్పిటల్ దౌర్జన్యాలు బయటపెట్టారు.  నెల్లూరు నగరంలోని అనసూయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్  పేరుతో ఉన్న ఈ  సెమీ కార్పొరేట్ హాస్పిటల్ పై పెద్దయెత్తున విమర్శలు ఆరోపణలు ఉన్నాయి.
ఎయిమ్స్ హాస్పిటల్ అత్యధికంగా ఫీజులు వసూలు చేయడం బాధితులకు సరైన వైద్యం చేయలేదంటూ కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. వారితో రాజీ ప్రయత్నాలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. గత రెండు రోజుల క్రితం నగరంలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ సైతం ఇదే తరహాలో కరోనా బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసింది.బాధితుడు మృతి చెందిన అనంతరం సైతం ఫీజులు వసూలు చేయడంపై వారి బంధువులు రోడ్డెక్కారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దాంతో ఆ కార్పొరేట్ హాస్పిటల్ బాధితులతో రాజీ ప్రయత్నాలు చేసింది.  ఇప్పుడు పొగ తోటలోని హాస్పిటల్ నిర్వాహకం వెలుగు చూడడం... కరోనా బాధితుల బాధలు ఒకవైపు అయితే... కార్పొరేట్ హాస్పిటల్ చేస్తున్న దోపిడి వారి కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. నెల్లూరులో ఇప్పటికే అనేక హాస్పిటల్స్లో విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదులు.. రాష్ట్ర ప్రభుత్వానికి చివరకు కోర్టు వరకు వెళ్లినప్పటికీ వారిపై చర్యలు శూన్యం అన్న విమర్శలు ప్రజా సంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0