నేడు అంతర్జాతీయ(Father's Day) పితృ దినోత్సవము.. శుభాకాంక్షలు తెలుపండిలా.. 

నేడు అంతర్జాతీయ(Father's Day) పితృ దినోత్సవము.. శుభాకాంక్షలు తెలుపండిలా.. 

జీవిత పాఠాలు నేర్పే నాన్న గొప్పతనం, త్యాగాలను స్మరించుకోడానికి పుట్టిందే ‘పితృ దినోత్సవం’ ఈ అంతర్జాతీయ పితృ దినోత్సవము (Father's Day) ను ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్ డే ను గుర్తించి జరుపుకున్నారు. ఆ తరువాత అలా అలా ఈ నాన్నల వందన దినోత్సవమునకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ లో వచ్చే మూడో ఆదివారాన్ని పితృ వందన దినోత్సవముగా ప్రకటించుకొని జరుపుకుంటున్నాయి. మరి ఈ ఫాదర్స్ డే రోజున ఈ అందమైన కోట్స్‌తో నాన్నకు ప్రేమతో శుభాకాంక్షలు తెలుపండిలా..

నాన్న మనకి ఓ గొప్ప వరం.. ఓ అనుభూతి.. ఓ భరోసా.. 
ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా..
ఓడినప్పుడు నేనున్నాలే అని
వెంట ఉండి ధైర్యం చెప్పే వ్యక్తి..
గెలిచినప్పుడు
పదిమందికి చెప్పుకుని
ఆనందపడే వ్యక్తి..
ఒక్కరే.. ఆయనే ‘నాన్న’
హ్యాపీ ఫాదర్స్ డే

అమ్మ తన ప్రేమను ఎన్నో విధాలుగా వెలిబుచ్చుతుంది
కానీ, నాన్న ఒక్క స్పర్శతో తన ప్రేమను వెల్లడిస్తాడు.

గెలిచినప్పుడు పదిమందికి చెప్పుకునే వ్యక్తి..
ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని
దగ్గరకు హత్తుకునే వ్యక్తి నాన్న ఒక్కరే
ఫాదర్స్ డే శుభాకాంక్షలు

ఓర్పుకు మారు పేరు,
నీతికి నిదర్శనం..
భవిష్యత్ మార్గదర్శకులు
మన ప్రగతికి సోపానం.. ‘నాన్న’
హ్యాపీ ఫాదర్స్ డే

మేమున్నామని ఎందరు చెప్పిన
నాన్నగారి ఆధరణ ముందు అవి ఏవీ నిలబడవు
హ్యాపీ ఫాదర్స్ డే
నాన్న.. అన్న పదము కన్నకమ్మగ ఉండదు వెన్న
లక్ష్యం వైపు దూసుకెళ్లే బాణం మనమైనా..

నాన్నలాంటి విల్లే లేకపోతే దాని ఫలితం సున్నా..
నాన్న పెంపకంలో కఠినత్వం ఉన్నా..
ఆ పెంపకానికి కారణం..
రేపటి మన భవిష్యత్తుకు ఆయన పడే తపన
రేపటి మనకు నిలువుటద్దం నాన్న..
అలాంటి నాన్న దేవుడి కన్న మిన్న.
హ్యాపీ ఫాదర్స్ డే

నువ్వు కోపంగా మాట్లాడుతుంటే..
ప్రశాంతతే తెలియదనుకున్నా..
కళ్లెర్రజేస్తుంటే.. కాఠిన్య హృదయమనుకున్నా..
ఆజ్ఞలు వేస్తుంటే బానిసగా బాధపడ్డా..
నాన్నా... నాకిప్పుడు తెలుస్తోంది..
వీటన్నిటి వెనుక మూల సూత్రం ఒకటుందని..
అదే మా పైన అమిత ప్రేమని,

జూన్ 19, ఆదివారం నాడు ఈ ఫాదర్స్ డే, ఈ రోజున మీ నాన్నను ఒక ఆలోచనాత్మక బహుమతితో ఆశ్చర్యపరచండి. గిఫ్టులతో కాకపోయినా వారితో నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు ఈ రోజును ఉపయోగించుకోవచ్చు.  
బడ్జెట్ గిఫ్ట్ ఐడియాలు
రూ. 500 కంటే తక్కువ చాక్లెట్లు, పుస్తకాలు
రూ. 500 నుంచి రూ. 1,000 కస్టమైజ్డ్ మగ్, ఫోటో ఫ్రేమ్
రూ. 1,000 నుంచి రూ. 2,000 షేవింగ్ కిట్, ఒక వాలెట్, ఇన్సులేటెడ్ లంచ్ బ్యాగ్
రూ. 2,000 నుంచి రూ. 5,000 వరకు డిజిటల్ ఫిట్ నెస్ బ్యాండ్, బ్లూటూత్ స్పీకర్
రూ. 5,000 నుంచి రూ. 10,000 పోర్టబుల్ డిజిటల్ ఆడియో ప్లేయర్, బ్రాండెడ్ సన్ గ్లాసెస్
రూ. 10,000 కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్, డిజైనర్ వాచ్.
పుస్తకాలు చదవటం మీ నాన్నకు ఇష్టమైతే, అతనికి ఒక పుస్తకం లేదా కొన్ని పుస్తకాలను కొనిపెట్టండి. రొమాన్స్, మిస్టరీ, థ్రిల్లర్ వంటి ఏ జానర్ అయినా సరే, విభిన్న జానర్స్‌కు చెందిన 2-4 పుస్తకాల కాంబోను కూడా మీరు కొనిపెట్టవచ్చు. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0