దీపావళి రోజున ఒంటి దీపం పెట్టకూడదు..

దీపావళి రోజున ఒంటి దీపం పెట్టకూడదు..

లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందట..!
‘‘దీప’’ అంటే దీపము. ‘ఆవళి’’ అంటే వరుస. దీప..  ఆవళి అంటే.. దీపాల వరుస అని అర్ధం. దీపం ఐశ్వర్యం అయితే అంధకా రం దారిద్య్రం. దరిద్రాన్ని పార ద్రోలి, ఐశ్వర్య మార్గంలోకి ప్రయా ణించడమే దీపావళి పండుగ ముఖ్యోద్ధేశ్యం. దీపం అనేది త్రిమూర్తి స్వరూపం. దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి. దీపంలోని ఎర్రని కాంతి బ్రహ్మదేవునికి, నీలి కాంతి శ్రీమహావిష్ణువుకి, తెల్లని కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు. 
సాజ్యం త్రివర్తి సంయుక్తం ` వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం ` త్రైలోక్య తిమిరాపహం
భక్త్యా దీపం ప్రయచ్ఛామి ` దేవాయ పరమాత్మనే
త్రాహిమాన్నరకాద్ఘోరాత్‌ ` దివ్య జ్యోతిర్నమోస్తుతే
ఏ దీపమైనా మూడు వత్తులు వేసి వెలిగించాలి గానీ.. ఒంటి దీపం, రెండు వత్తుల దీపాలు వెలిగించరాదు. మూడు వత్తుల దీపం. గృహానికి శుభాలు చేకూరుస్తుంది. ముల్లోకాలలోని అంధకారాన్ని పారద్రోలి లక్ష్మీనిలయంలా చేస్తుంది. నరకం నుంచి రక్షిస్తుంది. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అటువంటి దీపాన్ని భక్తిగా వెలిగించాలి. మరెంతో భక్తిగా నమస్కరించాలని పైశ్లోకం అర్థం.
అదేవిధంగా.. దీపావళి రోజున ఏ ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటాయో.. ఆ ఇంట మహాలక్ష్మీ కొలువు తీరుతుందని ప్రజల నమ్మకం. ఈ కారణంగా దీపావళి పండుగ సాయంత్రం దీపాలు పెడుతుంటారు. ఇంకా దీపావళి రోజున చనిపోయిన వారికి పెద్దల పండుగకి తర్పణాలు ఇస్తుంటారు. ఆ సమయంలో స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పితృదేవతలకు.. తిరిగి స్వర్గలోకాలకు వెళ్ళే సమయంలో వెలుతురు చూపించడం కోసమే దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందని ప్రతీతి.
లక్ష్మీదేవి పుట్టినరోజున విష్ణుమూర్తి నీకేం కావాలని అడిగితే నేను భూలోకానికి నేరుగా వెళ్ళి అంతా చూడాలనే కోరిక ఉందని చెప్పిందట. విష్ణుమూర్తి సరేనని పంపారు. అలా ప్రతి దీపావళి రోజు లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి వస్తుంది. లక్ష్మీదేవికి శుభ్రంగా వున్న ఇల్లు అంటే చాలా ఇష్టం. అందుకే దీపావళికి ముందు నాలుగు రోజుల నుంచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని మాత్రమే  శుభ్రం చేసుకోవడం కాదు.. పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచితే నెగిటివ్‌ ఎనర్జీ వస్తుంది. పగిలిన అద్ధం ఇంట్లో ఉంచితే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండటమే కాక మనస్పర్ధలు వస్తాయి. అద్దంలో చారలు వున్నా ఆ ఇంటిలో ధనం ఉండదు. విరిగిన మంచాలు ఉంటే బాగుచేయించాలి. లేకుంటే బయట పడేయాలి. ఆగిపోయిన గడియారం ఉంటే బాగుచేయించుకోవాలి. చెద పట్టిన ఫోటోలు ఉంటే బయట పడేయాలి. ఇంటి ముఖద్వారానికి రిపేర్లు ఉంటే చేయించాలి. అలాగే గత ఏడాది వాడిన దీపాలను మళ్ళీ వాడకూడదు. ఎవరి శక్తి కొలది వారు కొత్తవి తెచ్చుకొని వాడితే లక్ష్మీ కటాక్షిస్తుంది.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0