త్వరలో నడికుడి, పిడుగురాళ్ళ మీదుగా సికింద్రాబాద్-చెన్నై వందేభారత్ రైలు.. 

త్వరలో నడికుడి, పిడుగురాళ్ళ మీదుగా సికింద్రాబాద్-చెన్నై వందేభారత్ రైలు.. 

ఇటీవల కేంద్రం తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ వందేభారత్ రైలు ఇటీవలే సంక్రాంతి సందర్భంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకుని సికింద్రాబాద్, విశాఖ నగరాల మధ్య ప్రయాణిస్తోంది. తాజాగా రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడే రీతిలో మరో వందేభారత్ రైలును కేటాయించింది. సికింద్రాబాద్ నుంచి చెన్నైకి వచ్చే నెలలో వందేభారత్ రైలును ప్రారంభించనుంది. 
ఈ నేపథ్యంలో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్ లో ఈ రైలు చెన్నైలో బయల్దేరి గూడూరుకు రాత్రి 2 గంటలకు చేరుకుంది. అక్కడ్నించి బయల్దేరి ఒంగోలుకు ఉదయం 5.20 గంటలకు చేరుకుంది. చీరాలకు ఉదయం 6.25 గంటలకు, విజయవాడకు 8.25 గంటలకు చేరుకుంది. 
కేంద్రం ఇప్పటికే 8 వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టింది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను దశలవారీగా పెద్ద సంఖ్యలో ప్రవేశపెట్టేందుకు భారత రైల్వేశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇదిలావుంటే, ఈ రైలును వయా ఖాజీపేట, విజయవాడ మీదుగా లేదా వయా నడికుడి, పిడుగురాళ్ళ, గుంటూరు మీదుగా నడపాలా..? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది.  

What's Your Reaction?

like
2
dislike
1
love
0
funny
1
angry
0
sad
1
wow
0