'తారకరత్న' ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్సి ఇచ్చిన వైద్యులు..  

 'తారకరత్న' ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్సి ఇచ్చిన వైద్యులు..  

సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు.  అయితే, నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సీనియర్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్  కీలక అప్డేట్ ఇచ్చారు. తారకరత్న ఆరోగ్యం నిలకడకానే ఉందని తెలిపారు. ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. ఆయన ఆరోగ్యం క్షీణించలేదని బాలయ్య చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి.. మళ్లీ మాములు మనిషిగా తిరిగి రావాలని కోరుకుంటున్నామన్నారు. తారకరత్న శరీరంలోని అన్ని భాగాలు బాగా పనిచేస్తున్నాయని చెప్పారు బాలయ్య. ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల స్టంట్ వేయడానికి కుదరలేదని.. స్టంట్  వేస్తే మళ్లీ స్ట్రోక్  వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారన్నారు. డాక్టర్లు  చాలా జాగ్రత్తగా తారకరత్నకు వైద్యం అందిస్తున్నారని బాలయ్య మీడియాకు తెలిపారు.

అలాగే నందమూరి తారకరత్నను చూసేందుకు బెంగుళూర్ కు చేరుకున్నారు హీరో జూనియర్ ఎన్టీఆర్. . తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ప్రస్తుతం కోలుకుంటున్నారన్నారు. అయితే క్రిటికల్ కండిషన్ నుండి ఇంకా బయటపడినట్లు కాదని తెలిపారు. హీరో కళ్యాణరామ్ కూడా వెంట వున్నారు.   

What's Your Reaction?

like
1
dislike
0
love
0
funny
0
angry
0
sad
4
wow
0