‘డబ్బుల్లేవ్’ అంటే కోర్టు ఏం చేస్తుంది.. ?

‘డబ్బుల్లేవ్’ అంటే కోర్టు ఏం చేస్తుంది.. ?

అమరావతి : ఏకైక రాజధానిగా అమరావతికి మద్దతుగా హైకోర్టు చాలా విస్పష్టమైన తీర్పు చెప్పేసింది. ఆరు నెలల్లోగా నిర్మాణాలు కూడా చేయాలని, మూడు నెలల్లోగా మౌలిక వసతులు కల్పించి.. పొలాలు ఇచ్చిన రైతులకు ప్లాట్లు అప్పగించాలని కూడా తీర్పులో స్పష్టంగా పేర్కొంది. 
రాజధానిలో ఉండదగిన కార్యాలయాలను ఇప్పుడున్న విజయవాడ, అమరావతి ప్రాంతాలనుంచి ఇతర ప్రాంతాలకు తరలించడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదని చెప్పేసింది. ఈ హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ మంత్రులతోను న్యాయనిపుణులతోను చర్చించారు. అయితే ఈ పనులు చేపట్టడానికి ప్రభుత్వం దగ్గర సొమ్ములు ఎక్కడున్నాయి. కోర్టు ఆదేశాలను వారు ఎలా పూర్తి చేయగలరు. కోర్టు ఆదేశాలు అమలుకాకపోయిన పక్షంలో ఏమవుతుంది? నెలనెలా ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా నిదులు దేవులాడుతున్న ప్రభుత్వం.. కోర్టు ఆదేశించిన వెంటనే, వందలు.. వేల కోట్లు ఖర్చు పెట్టి.. మౌలిక సదుపాయాల కల్పన వ్యవహారం మొత్తం పూర్తి చేయగలుగుతుందా? సాధ్యమేనా? అనేది ఇప్పుడు అందరికీ కలుగుతున్న సందేహం. 

అయితే ప్రభుత్వం వద్ద నిజంగానే డబ్బుల్లేకుండాపోయిన పరిస్థితిలో.. ఆ విషయాన్నే వారు కోర్టుకు నివేదిస్తే ఏం చేస్తారు. కోర్టు పట్టుబట్టినా సరే.. ఇప్పుడు డబ్బుల్లేవు గానీ.. డబ్బు రాగానే వసతులు కల్పిస్తాం అని ప్రభుత్వం అఫిడవిట్ వేస్తే ఇక కోర్టు ఏం మాట్లాడగలుగుతుందది. అలాంటి ఒప్పుకోలు ద్వారా.. కోర్టు ఆదేశాలను అమల్లో పెట్టడం అనే పనిని.. రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘకాలం వాయిదా వేసుకుంటూ పోవడానికి కూడా ఆస్కారం చిక్కినట్లే నాని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0