టీడీపీ నేత కోడెల శివరాం హౌస్ అరెస్ట్

టీడీపీ నేత కోడెల శివరాం హౌస్ అరెస్ట్

సత్తెనపల్లి : సత్తెనపల్లి లో ఈ ఉదయం ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత కోడెల శివరాంను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. చంద్రన్న ఆశయ సాధన పేరుతో శనివారం పాదయాత్ర చేసేందుకు కోడెల శివరాం సిద్ధమయ్యారు. రాజుపాలెం నుంచి దేవరంపాడు కొండ వరకు భారీ పాదయాత్ర చేయాలని సంకల్పించారు. సత్తెనపల్లి, రాజుపాలెం లలో ఈ సందర్బంగా పెద్దఎత్తున తెదేపా నాయకులు, కార్యకర్తల సందడి నెలకొంది. 
అయితే పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కోడెల ఇంటితోపాటు సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతల ఇళ్ల వద్ద కూడా పోలీసులు మోహరించారు. సత్తెనపల్లి పట్టణంలోని నరసరావుపేట సెంటర్ లో కూడా పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. రాజుపాలెం మండలం టీడీపీ అధ్యక్షుడు అంచుల నరసింహారావును కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0