జనవరి 8 న జూ. ఎన్టీఆర్ నుంచి కీలక ప్రకటన..

జనవరి 8 న జూ. ఎన్టీఆర్ నుంచి కీలక ప్రకటన..

ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా.. అన్ని భాషల్లో భారత దేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాలలో కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇప్పుడున్న క్రేజ్ మామూలుది కాదు. సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ – రాజమౌళి కలిసి చేసిన ప్రతి సినిమా సక్సెస్ అంటే మామూలు సక్సెస్ కాదు.. ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. అలాంటిది వీళ్ళిద్దరూ లాస్ట్ లో చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించుకున్నారు. ఆ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

 రెండు పార్టులుగా తెరకెక్కుతున్న దేవర ఎప్పుడెప్పుడు షూటింగ్ ని పూర్తి చేసుకొని తమ ముందుకు వస్తుందా అని నిత్యం దేవర నామ జపం చెయ్యని ఎన్టీఆర్ అభిమాని లేడు. పైగా ఈ మూవీ నుంచి మొట్టమొదటి సారి సముద్రం మధ్యలో చిన్న నాటు పడవ మీద చేతిలో ఒక పెద్ద బల్లెం లాంటిది పట్టుకొని సీరియస్ మోడ్ లో ఉన్న ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాంతో నిత్యం దేవరకి సంబంధించిన పోస్టర్స్ గాని వార్తలు గాని వస్తు ఉండాలని అభిమానులు భావిస్తు వచ్చారు. కానీ కొన్ని రోజుల నుంచి దేవరకి సంబంధించిన నయా అప్ డేట్ ని మేకర్స్ ప్రకటించటంలేదు. తాజాగా ఇప్పుడు  సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక వార్త అభిమానుల్లో జోష్ ని తెప్పిస్తుంది.

వచ్చే జనవరి 8  న  అభిమానుల కోసం  చిత్ర యూనిట్ సినిమాకి సంబందించిన ఒక అదిరిపోయే ట్రీట్ ని ఇవ్వబోతుంది. ఆ రోజున దేవర కి సంబంధించిన కొన్ని  గ్లింప్స్ ని రిలీజ్ చెయ్యబోతున్నారు.ఈ మేరకు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం జనవరి 8  న ఎన్టీఆర్ అభిమానులకి దేవర నుంచి ఒక గుడ్ న్యూస్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. మరికొన్ని రోజులు ఆగితే గాని అసలు విషయం తెలియదు. ప్రస్తుతానికి అయితే సినిమా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
1
angry
0
sad
0
wow
0