గులాబీలో మొదలైన విబేధాలు

గులాబీలో మొదలైన విబేధాలు

మెదక్, జూన్ 22, 
 సమైక్య పాలనలో జరిగిన అన్యాయమే ప్రత్యేక రాష్ట్రంలోనూ కొనసాగుతుందని పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎక్కడో జరిగిన సంఘటన కాదు. స్వయాన ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజక వర్గం కొండపాక మండలంలో చోటు చేసుకున్న సంఘటన. ఆదివారం సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా తమకు ఆహ్వానం అందలేదని సోషల్ మీడియా వేదికగా పలువురు సర్పంచులు అధికార పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నాటి నీటిపారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్య చేసిన తప్పులనే నేటి అధికార పార్టీ చేస్తుంది. అప్పటికీ, ఇప్పటికీ మేము అన్యాయానికి గురవుతున్నామని పలువురు ప్రజాప్రతినిధులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.సీఎం తమ ప్రాంతంలో పర్యటిస్తున్నాడంటే ఆ ప్రాంత ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోతుంది. ఆ ప్రాంత ప్రజాప్రతినిధులైతే ఎప్పుడు ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకోవాలి. గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలని పరితపిస్తుంటారు. అలాగే ఆదివారం రోజున సీఎం పర్యటన సందర్భంగా పలువురు కొండపాక మండల ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి తమ సమస్యల్ని విన్నవించుకుందామని రెడీ అయ్యారు. విషయం తెలుసుకున్న కొందరు మండల, జిల్లా నాయకులు కొండపాక మండలస్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందించలేదు. దీనిపై కొండపాక మండల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇది తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు గుర్తొచ్చే తాము అధికారిక సమావేశాలకు గుర్తుకు రాలేదా అంటూ అధికార పార్టీ తీరు, మండల, జిల్లా నాయకత్వంపై అసహనం వ్యక్తం చేశారు.కొండపాక మండలానికి ఈశాన్య దిక్కులో ఉన్న అంకిరెడ్డిపల్లి, దర్గా, బందారం గ్రామాలకు తపాసుపల్లి నీళ్లు రాలేదు. ఇది సమైక్య పాలనలో నేడు ప్రత్యేక రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తపాసుపల్లి రిజర్వాయర్ నింపి కొండపాక మండలంలోని అన్ని గ్రామాలు నింపారు. ఒక్క ఈ మూడు గ్రామాలు తప్పా. ఈ మూడు గ్రామాల సర్పంచులు పలుమార్లు జిల్లా మంత్రి హరీశ్‌రావుకు పలుమార్లు విన్నవించుకున్నారు. అయిన సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. మల్లన్న సాగర్ నుండి నీళ్లు ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చి రెండేళ్లయినా హామీ నెరవేరలేదు. మా గ్రామం నుండి పక్క గ్రామాలకు నీళ్లు పోతున్నాయి తప్పా మా మూడు గ్రామాలకు నీళ్లు ఇవ్వడం లేదని, ఒక్క తల్లి దయ్యమైతే ఇంట్లో తొట్టె కట్టి తావుండదన్నట్టుగా టీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న వారు అన్యాయం చేస్తున్నట్టుగా ఉందని సర్పంచులు చెబుతున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం. కానీ ప్రత్యేక రాష్ట్రంలోనూ ఇదే వివక్ష కొనసాగుతుంది. సీఎం పర్యటనలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆహ్వానించకపోవడమే ఇందుకు నిదర్శనం. నిన్నటి సీఎం పర్యటనతో అధికార పార్టీలో ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. గతంలో నూ ఇలాంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. సీఎం పర్యటనలో మండల ప్రజాప్రతినిధులకు అందిన ఆహ్వానం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులకు ఎందుకు అందలేదని గుర్రు మంటున్నారు. సీఎం స్వంత నియోజక వర్గంలో మండల నాయకులు, స్థానిక నాయకులకు మధ్య సయోధ్య పొసగడం లేదని సుస్పష్టమవుతుంది. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు, జిల్లా మంత్రి ఈ విషయంలో తలదూర్చి సమస్యను పరిష్కరించుకుంటేనే పార్టీ బలోపేతమవుతుంది. లేదంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోందని స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నారు

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0