ఏపీలో వంద ప్లస్‌ 1,174..!

ఏపీలో వంద ప్లస్‌ 1,174..!

నెల్లూరు, జనవరి 13 : నేటి పరిస్థితుల్లో వందేళ్లు జీవించడమంటే సామాన్య విషయం కాదు. నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరిగిన నాగరికత వంటి కారణాలతో ఎనభై ఏళ్లకే ఎక్కువ మంది తనువులు చాలిస్తున్నారు. కల్తీ ఆహారం కూడా ప్రాణాలను త్వరగా తీసుకెళుతుంది. పాలు కల్తీ.. ధాన్యం కల్తీ...పప్పులు.. ఉప్పులు.. కూరగాయలు.. ఇలా ఒక్కటేమిటి.. అన్నీ కల్తీనే. కల్తీ లేని వస్తువు ఏదీ మార్కెట్‌ లో దొరకడం లేదు. వాటిని తీసుకుని ఎక్కువ కాలం జీవించకపోవడం ఒక ఎత్తైతే.. చిన్న వయసులోనే రోగాల బారిన పడుతున్నారు. ఇరవై పదులు దాటిన వెంటనే మందులతో బతుకుతున్న వారు కూడా అనేక మంది ఉన్నారు. ఇక మన శరీరానికి సరైన ఎక్స్‌ర్‌సైజ్‌ కూడా ఉండటం లేదు. మొబైల్‌ ప్రపంచం.. నెట్టింట పనులు చేస్తుండటంతో నడక కూడా కష్టమవుతుంది. కొద్దిపాటి దూరానికే బండి తీసేవాళ్లు అనేక మందిని చూస్తుంటాం. నడక అనేది పూర్తిగా మర్చి పోవడంతో హృద్రోగాలు కూడా వయసుతో నిమిత్తం లేకుండా వస్తున్నాయి. చిన్న వయసులోనే హార్ట్‌ అటాక్‌ లు రావడం కూడా ఇందుకు కారణంగా వైద్యులు చెబుతున్నారు. ఏడో తరగతి చదువుతున్న వారికి కూడా గుండెపోటు రావడమేంటోనని తలలు పట్టుకుంటున్నారు వైద్యులు. ఇలా అన్ని రకాలుగా ఆయు:ప్రమాణం పెరిగిందని కొందరు అంటుంటున్నా.. తగ్గిందని మరికొందరు వాదిస్తున్నారు. ఎనభై ఏళ్లు బతికితే ముక్కున వేలేసుకునే రోజులు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ లో ఎక్కువ మంది శతాధిక వృద్ధులు ఉండటం కొంత ఆశ్చర్యంగానూ.. మరికొంత ఆనందంగానూ కనిపిస్తుంది. నాటి తిండి తిని నేటికీ తట్టుకుని వారు ఉన్నారని సంతృప్తి పడేవారున్నప్పటికీ కేంద్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం ఏపీలో 1,174 మంది వందేళ్లు దాటిన వృద్ధులున్నారు. వీరికి ఇంటి నుంచి నేరుగా ఓటు వేసే సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల అధికారులు చెప్పారు. అయితే ఎన్నికల సంగతి అలా ఉంచితే ఏపీలో అంత మంది వందేళ్లు దాటిన వారు ఉండటం ఒకరకంగా సంతోషించదగ్గ విషయమేనన్న కామెంట్స్‌ వినపడుతున్నాయి. సో.. వారంతా నిండు నూరేళ్లూ జీవించారని ఆనందించాల్సిన అంశమే. ఓటు కోసం కాదు కానీ వయసులో పెద్దవారు ఉండటం ఈ సమాజానికి అవసరమన్నది కూడా సైకాలిజిస్టులు చెబుతున్న విషయం

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0