ఇవి పాటిస్తే కుటుంభంలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరికినట్లే..!

ఇవి పాటిస్తే కుటుంభంలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరికినట్లే..!

కుటుంబంలో సమస్యలు ఎక్కువగా ఉన్నా, ఆందోళన పరిస్థితులు తలెత్తినా వాస్తు దోషాన్ని సరిచేయడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. భారత సనాతన ధర్మంలో వాస్తుశాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కుటుంబ ఆనందం, శ్రేయస్సు లాంటి వాటిని వాస్తు ప్రభావితం చేస్తుంది. కుటుంబంలో శక్తి సరైన సమతూల్యతను నేర్పే ఈ గ్రంథంలో ఇందులో అనేక చర్యలు ఉన్నాయి. దీని ద్వారా జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనవచ్చు. కుటుంబంలో సమస్యలు ఎక్కువగా ఉన్నా, ఆందోళనకర పరిస్థితులు తలెత్తినా వాస్తుదోషాన్ని సరిచేయడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు సర్దుబాటు చేయాల్సిన అవసరం వుంది. ఇందుకోసం ప్రముఖ వాస్తు నిపుణులు కృష్ణ ప్రసాద్‌ కొన్ని ఉపాయలు తెలియజేస్తున్నారు.
ఇంటి యజమాని నైరుతి దిక్కులో నిద్రించాలి

వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి యజమాని ఎప్పుడూ నైరుతి దిక్కులోనే నిద్రించాలి. అలాగే తల దక్షిణ దిక్కులో పెట్టుకొని పడుకోవాలి. ఇష్టదైవమైన విగ్రహం లేదా చిత్ర పటం ముందు క్రమం తప్పకుండా ఆవునెయ్యి లేదా నువ్వులనూనె లేదా కొబ్బరినూనెతో దీపారాధన చేయండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి నైరుతి దిక్కులో ఎక్కువగా తలుపులు లేదా కిటికీలు ఉంటే దొంగతనం, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం వుంది. అంతేకాకుండా అనారోగ్యంపై ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు వాటిని మూసి ఉంచితే మంచిది. ఒకవేళ అలా కుదరని పక్షంలో ప్రతి గురువారం క్రమం తప్పకుండా బెల్లం, శనగలు, కాయధాన్యాలు, నెయ్యితో చేసిన రొట్టెలను ఆవుకు తినిపించండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారని చెబుతారు. ఆవును లక్ష్మీదేవిగా పూజిస్తారు. ఇదే సమయంలో కుటుంబ సభ్యుల జీవితంలో ఆనందం, శాంతి పెరుగుతాయి. 
వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద పువ్వులు, ముళ్ళ మొక్కలను నాటకూడదు. అలాగే మురికి నీరును ఇంటి ముందు ఉండేలా చూడకూడదు. ఎందుకంటే ఇది ఇంట్లో నివసించే ప్రజల జీవితాన్ని కష్టతరం చేస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులు ఒకే రకమైన వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు. వీటి నుంచి ఉపశమనం పొందడానికి శుభానికి ప్రతీక అయిన ఓం గణపతి, శుభ్‌।లాబ్‌ చిహ్నాన్ని ఉంచడమో లేదా మీ ఇష్ట దేవత వద్ద రాయడమో చేయాలి. ఇలా చేయడం ద్వారా జీవితంలో అనేక కష్టాలు తొలగిపోతాయి.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0