'ఆర్‌ఆర్‌ఆర్‌' మొదటి టాక్ వచ్చేసింది.. ఊహించని ట్విస్టులు.. సినీ చరిత్రలోనే బంపర్ రికార్డ్..

 'ఆర్‌ఆర్‌ఆర్‌'  మొదటి టాక్ వచ్చేసింది.. ఊహించని ట్విస్టులు.. సినీ చరిత్రలోనే బంపర్ రికార్డ్..

సినిమా అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎట్టకేలకు వచ్చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి విజన్‌, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కృషి ఫలితానికి ఈ రోజు ప్రతిఫలం దక్కింది. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేందుకు...ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రేక్షకులకు ముందుకు ఈ తెల్లవావారుజామున బెనిఫిట్ షో తో వచ్చేసింది. ఇప్పటికే బెన్‌ఫిట్‌ షోలు, ప్రీమియర్‌ ఫోలు మొదలయ్యాయి. సినిమా చూస్తున్న అభిమానులు అప్పుడే ట్విట్టర్‌ వేదికగా ఆర్‌ఆర్‌ఆర్‌ రివ్యూను చెప్పేస్తున్నారు. సినిమా ఎలా ఉందన్న వివరాలను ట్విట్వర్‌ వేదికగా పంచుకుంటున్నారు. థియేటర్లలో బాక్సులు అవుతున్నాయని, సినిమాలో ఊహించని ట్విస్టులు ఎన్నో ఉన్నాయంటూ ట్వీట్లు చేస్తున్నారు..
ఓ అభిమాని అయితే సినిమాకు ఏకంగా 4.5 రేటింగ్ ఇచ్చేశాడు. వరల్డ్‌ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌.. సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉంది. యాక్షన్‌ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. సినిమా మొదటి నుంచి చివరి వరకు అద్భుతంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.
ఇక మరో నెటిజన్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘ఫస్ట్‌ హాఫ్‌ నిడివి 1 గంట 40 నిమిషాలు ఉందని తెలిసిన తర్వాత సినిమా ఎక్కడ బోర్‌ కొడుతుందో అని భయపడ్డాను. కానీ సినిమా అద్భుతంగా ఉంది. చిత్ర యూనిట్ పడ్డ కష్టం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అద్భుతంగా నటించారు అంటూ రాసుకొచ్చాడు.
మరో అభిమాని ఈ సినిమాతో ఎన్టీఆర్ కు నేషనల్ అవార్డు రావడం ఖాయమన్నారు. 
సినీ చరిత్రలోనే ఇంత గొప్ప సినిమా ఇంతవరకు రాలేదని అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. 

What's Your Reaction?

like
0
dislike
0
love
1
funny
0
angry
0
sad
0
wow
0