అర్ధం కాని జగన్ వ్యూహం..

అర్ధం కాని జగన్ వ్యూహం..

విజయవాడ, జులై 16 (ఇండియాజ్యోతి) : బీజేపీ ఒక రాజకీయ పార్టీ. అద్భుతమైన వ్యూహాలు కలిగిన పార్టీ. లేకపోతె రెండే రెండు సీట్లు కలిగిన చోటు నుండి ఈరోజున రెండు సార్లు ఫుల్ మెజార్టీతో కేంద్రంలో గద్దె మీద ఎలా కూర్చోగలదు. దేశంలో రాజకీయం మొత్తం ఔపోసిన పట్టేసిన పార్టీ అది. ఇక ఏపీలో రాజకీయం మీద ఆ పార్టీకి అవగాహన తక్కువే అనుకుంటే అవతలవారిదే పొరపాటు. ఏపీలో బీజేపీ సొంతంగా ఎదుగూ బొదుగూ లేని స్థితిలో వుంది. మరో వైపు అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూడా స్నేహం కోసం చేతులు చాస్తున్నాయి. జగన్ ఢిల్లీ వెళ్లి వస్తున్నారు. పెద్దలను కలిసి వినతులు చేస్తున్నారు. ఇలా తొలి రెండేళ్లలో పదిసార్లు పూర్తయింది. మరో మూడేళ్ళలో మరిన్ని ఢిల్లీ టూర్లు కూడా వున్నాయి. అయితే దీనివల్ల ఏమి ఒరిగింది అంటే పెదవి విరుపే జవాబు అవుతుంది. తాజాగా కేంద్ర పెద్దలను కలిసి కనీసం అప్పు చేసుకునే వెసులుబాటు అయినా ఇవ్వండి మహాప్రభో అని వేడుకున్నాకూడా, ససేమిరా కుదరదు అని కోత విధించారు. ఏపీ రుణపరిమితిలో భారీ కటింగ్ విధించి జగన్ కు గట్టి షాక్ ఇచ్చారు. 43 వేల కోట్ల దాకా రుణపరిమితిని పెంచమంటే, 27 వేల కోట్లకు  లెక్కను దించేశారు. ఏపీ ఖజానా సంగతి అందరికి తెలుసు. అక్కడ ఏమీ లేదు అని ఢిల్లీ పెద్దలకు తెలుసు. మరి జగన్ ఈ రెండేళ్లలో ఏం చేశారు అంటే, అప్పులే చేశారు. నాడు టీడీపీ అదేచేసింది. ఇలా రెండు ప్రభుత్వాలు కలిసి ఏడేళ్ల కాలంలో ఏకంగా అప్పులను నాలుగు లక్షల కోట్లకు పెంచేశారు. మరో మూడేళ్లు జగన్ అప్పులు చేస్తే ఖచ్చితంగా ఆరు లక్షల కోట్లకు చేరిపోతుంది. ఇప్పటికే ఏపీ దివాలా తీసిందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. మొత్తానికి కేంద్రం రుణ పరిమితిని విధించడానికి ఇది కూడా కారణం అంటున్నారు నిపుణులు. జగన్ సర్కారు కు చెప్పుకోవడానికి సంక్షేమమే వుంది. ఈమధ్యనే ప్రభుత్వ సొమ్ముతో పంచుడేంది అంటూ సోము వీర్రాజు గర్జించారు. కేంద్రానిదీ అదే ఒపీనియన్. జగన్ ఆలా రాజకీయంగా ఎదిగిపోతుంటే తమకు ఇబ్బంది. అందుకే ఎక్కడ మీట నొక్కాలో, అక్కడే నొక్కేశారు. కేంద్రం నిధులు ఇవ్వదు.. అప్పులు చేసుకోనివ్వదు.. మరి సర్కార్ బండిని నడిపేది ఎలా.. ఇలా జగన్ చక్రబంధంలో ఉంటేనే కదా.. జనంలో బ్యాడ్ అయ్యేది. జనాలకు ఈ విషయాలు తెలియవు. పథకాలలో కోతవేసినా, అవి ఆగినా నెగిటివిటి వచ్చేస్తుంది. అందుకే బీజేపీ ఇలా షాక్ ఇచ్చేసింది అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి జగన్ నుంచి కేంద్రంతో గుడ్ రిలేషన్స్ వున్నాయి. కానీ అక్కడ వున్నది మోడీ, అమిత్ షా. అందుకే జగన్ వారికి దగ్గర కాదు.. దూరము కాదు.. మరి ఏమిటీ అంటే జవాబు వుండదంతే...      

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0