అణ్వస్త్రాలను రష్యా ప్రయోగించనుందా.. ? మూడో ప్రపంచ యుద్ధం తప్పదా.. ?

అణ్వస్త్రాలను రష్యా  ప్రయోగించనుందా.. ? మూడో ప్రపంచ యుద్ధం తప్పదా.. ?

పుతిన్ తన మొండిపట్టును వీడడం లేదు. ఒక ప్రక్క శాంతి చర్చలు అంటూనే అణుబాంబులు సిద్ధం చేయాలన్న రష్యా అధ్యక్షుడు ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కి పడేలా చేసింది. రష్యా ప్రకటనపై భగ్గుమన్న నాటో దేశాలు కూడా అణ్వాస్త్రాలతో అలర్ట్‌ అవుతున్నాయి. దేనికైనా సై అంటున్నాయి పశ్చియ దేశాలు. తాజా ఉద్రిక్తతలతో చరిత్రలో కనీవిని ఎరుగని నాగసాకి, హిరోషిమా విషాదాలు మరోసారి కళ్లముందు కదలాడాయి. ప్రపంచ దేశాలు రష్యా వైఖరి ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. 

ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు రెండు దేశాలూ చర్చలకు అంగీకరించి, ప్రక్రియ మొదలు అయినా అణ్వాయుధ బలగాలను హై అలెర్ట్‌లో ఉంచాలంటూ ఆర్మీ చీఫ్‌లను ఆదేశించారు పుతిన్‌. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో బయటి నుంచి జోక్యం చేసుకోవాలని ఎవరైనా భావిస్తే చరిత్ర రిపీట్‌ అవుతుందని, పర్యవసానాలు సీరియస్‌గా ఉంటాయని నాటో దేశాలకు ముందే వార్నింగ్ ఇచ్చారు పుతిన్‌. లేటెస్టుగా నాటో దళాలు రష్యాకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నాయని అనుమానించిన పుతిన్.. అణ్వాయుధ బలగాలను అప్రమత్తంగా ఉంచాలని ఆదివారం ఆర్మీ అధికారులను ఆదేశించారు. ఇదిలావుంటే యుద్ధంలో ఉక్రెయిన్ ను రష్యా స్వాధీనం చేసుకునే పరిస్థితే వస్తే.. అప్పడు ఉత్పన్నమయ్యే పరిస్థితులు మూడో ప్రపంచ యుద్దానికి దారితీస్తాయా.. ? అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య చర్చలు విఫలం..?

రష్యా - ఉక్రెయిన్ ల మధ్య చర్చలు విఫలమయ్యాయి. రష్యా బలగాలను వెనక్కు తీసుకోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. అదే సమయంలో నాటోలో చేరబోమని ఉక్రెయిన్ లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా షరతు విధించింది. అయితే నాటో లో చేరడంపై ఉక్రెయిన్ లిఖితపూర్వకంగా ఇవ్వడానికి ఇష్పపడలేదు. దీంతో ఉక్రెయిన్ - రష్యాల మధ్య చర్చలు విఫలమయ్యాయని తెలుస్తోంది. రష్యా - ఉక్రెయిన్ ల మధ్య చర్చలు సోమవారం బెలారస్ లో ప్రారంభమయ్యాయి. రెండు దేశాలకు చెందిన విదేశాంగ అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. అయితే చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0