గుంటూరు లో వింతపోకడ ... బర్తడే పార్టీ కోసం కాల్ గాళ్స్...

గుంటూరు లో వింతపోకడ ... బర్తడే పార్టీ కోసం కాల్ గాళ్స్...

గుంటూరు, జూన్ 26, (ఇండియాజ్యోతి)
గుంటూరు నగరంలో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నగరంలోని అరండల్‌పేటలోని ఓ హోటల్‌లో ముగ్గురు యువకులు తమ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బెంగళూరు నుంచి కాల్‌గర్ల్స్‌ను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహించినట్లు పోలీసులకు సమాచారం అందింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హోటల్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఒకే గదిలో ఉన్న ఐదుగురు యువకులు, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

యువకులను అరండల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు... అమ్మాయిలను పునరావాస కేంద్రానికి అప్పగించారు. వీరు రేవ్‌ పార్టీ కోసమే అమ్మాయిలను రప్పించారా? లేక హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోటల్‌ నిర్వాహకులను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.

What's Your Reaction?

like
11
dislike
4
love
5
funny
2
angry
4
sad
4
wow
1