EVM లపై జగన్ సంచలన ట్వీట్..!
EVM లపై జగన్ సంచలన ట్వీట్..!
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు పాలన ప్రారంభం అయిన వేళ కొత్త రాజకీయం తెర మీదకు వస్తోంది. ఎన్నికల్లో అనూహ్య ఓటమి పాలైన మాజీ సీఎం జగన్ పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈవీఎంల వ్యవహారం పై చర్చ జరగాలన్నారు. తాను త్వరలోనే రాష్ట్రంలో పర్యటన ప్రారంభిస్తానని జగన్ వెల్లడించారు.
కాగా, తాజాగా ఆయన ఈవీఎంలపై సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను మాత్రమే వాడాలి అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం బ్యాలెట్ పత్రాలను వాడుతున్నారన్నారు. ఇదంతా పెద్ద పెద్ద వాళ్ళ కూటమని, ఎన్నికల ఫలితాలపై ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలని జగన్ ట్వీట్ చేశారు. జగన్ మేనమామ రామచంద్రారెడ్డి కూడా మాట్లాడుతూ EVM లను ట్యాంపరింగ్ చేశారన్నారు. చాలాచోట్ల పోలైన ఓట్లకు వచ్చిన ఫలితాలకు పొంతన లేకుండా పోయిందన్నారు.