8 రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

 8 రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎనిమిది రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే లాభాల్లోకి దూసుకెళ్లిన మార్కెట్లు చివరి వరకు అదే జోరును ప్రదర్శించాయి. మార్కెట్లు వరుస నస్టాలకు గురైన నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. బ్యాంకింగ్, మెటల్ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతు మార్కెట్లకు కలిసొచ్చింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 449 పాయింట్లు లాభపడి 59,411కి పెరిగింది. నిఫ్టీ 147 పాయింట్లు పుంజుకుని 17,451కి చేరుకుంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.69%), యాక్సిస్ బ్యాంక్ (2.54%), టెక్ మహీంద్రా (2.30%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.20%), టీసీఎస్ (2.16%). 

బీఎస్ఈ సెన్సెక్స్ లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.53%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.22%) నష్టపోయాయి. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0