8న సికింద్రాబాద్-తిరుపతి(వయా పిడుగురాళ్ళ) వందేభారత్ రైల్ ప్రారంభం.

సికింద్రాబాద్-: ఈనెల 8న సికింద్రాబాద్-తిరుపతి(వయా పిడుగురాళ్ళ) మీదుగా నడిచే 2వ వందేభారత్ రైల్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దక్షిణమధ్య రైల్వేలో మొదటి వందేభారత్ రైల్ ను ప్రధాని మోదీ గత సంక్రాంతి నాడు వర్చువల్ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య ప్రస్తుతం నడుస్తోంది. కాగా 2వ రైలును ప్రధాని మోదీ సికింద్రాబాద్ లో ఉదయం 11.30 గంటలకు ప్రారంభిస్తారు. అయితే ఈ రైలు వారంలో 6 రోజులు మాత్రమే నడుస్తోంది. ప్రతి మంగళవారం సెలవు. కాగా ఈరైలు మొదటి రోజున సికింద్రాబాద్-గుంటూరు మధ్య కేవలం నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్లలో కూడా ఆగుతుంది. 2వ రోజు నుండి కేవలం నల్గొండ లోనే ఆగుతుంది. అలాగే, ఈరైలు కేవలం 8.30 గంటల్లోనే గమ్యానికి చేరుకోనుండటం విశేషం. మిగిలిన రైళ్లు 12 గంటలు పడుతోంది.
What's Your Reaction?






