సచివాలయాలు, వాలంటీర్లు విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

సచివాలయాలు, వాలంటీర్లు విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

సచివాలయాలు, వాలంటీర్లు విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

ఏపీ లో పరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ మీద ఒక ఫైనల్ డెసిషన్ కు వచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థని ముగించే దిశగా ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండు నెలలు సామాజిక పెన్షన్ లను సచివాలయ సిబ్బంది చేత ఇప్పించారు. 1 వ తేదీనే 100 శాతం పంపిణి చేశారు.పెన్షన్స్ ఇచ్చే వాలంటీర్లు చేసే పని సచివాలయ సిబ్బందితో పంచిస్తున్నారు సో వాటికి ఇబ్బంది లేదు. ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు రావట్లేదు. ప్రజలు అసలు వాలంటీర్లను గుర్తు తెచ్చుకుంటున్నారా అన్న డౌట్ కొడుతుంది. ఇక వారికి శాలరీ కూడా చివరి సారి జూన్ లో గౌరవ వేతనంగా ఇచ్చారని తెలుస్తుంది. జూలై, ఆగస్ట్ రెండు నెలలూ వారికి వేతనాలు అందలేదని తెలుస్తుంది.

వాలంటీర్లను కొనసాగించాలి అంటే ఏడాదికి వేల కోట్లు ఖర్చు పెట్టాలి. అందుకే వారు అవసరమా అన్న చర్చ సాగుతుంది. వాలంటీర్లు అంతా గత ప్రభుత్వం వైసీపీ హయాంలో నియామకం జరిగింది. ఈ వ్యవస్థను మరో విధంగా కొనసాగించాలని అనుకున్నా ఇపుడు కుదరదు.అలా చేస్తే వాలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడినట్టే అని అంటున్నారు.

What's Your Reaction?

like
2
dislike
2
love
1
funny
0
angry
0
sad
2
wow
0