సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో..  తెలంగాణ విమోచన వేడుకలు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో..  తెలంగాణ విమోచన వేడుకలు

కేంద్రం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ విమోచన వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. జాతీయ జెండాను షా ఆవిష్కరించారు. సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులు అర్పించారు. అంతకుముందు అమరవీరులకు నివాళులు అర్పించిన అమిత్ షా... సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.

కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన రాజ్ నాథ్ సింగ్

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం నటుడు కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. అనారోగ్య సమస్య కారణంగా కృష్ణంరాజు ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌, సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, వారి కుమార్తెలతోపాటు, సినీ హీరో ప్రభాస్‌‌ను రాజ్ నాథ్ పరామర్శించారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0