శ్రీ శారదా పీఠం వార్షికోత్సవ వేడుకలకు హాజరైన సీఎం జగన్
విశాఖపట్నం శ్రీ శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో జరిగిన రుద్ర హోమం, వేదపండిత సభ పూర్ణాహుతిలో ఆయన శ్రీ రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి తదితరులు హాజరయ్యారు.ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి విజయవాడకు బయలుదేరి వెళ్లారు.