This site uses cookies. By continuing to browse the site you are agreeing to our use of cookies Find out more here
నరసరావుపేట, మార్చి 26 (ఇండియాజ్యోతి) : పల్నాడు జిల్లాలో మునుపెన్నడు నిర్వహించని అరుదైన అత్యంత క్లిష్టతరమైన గుండెఆపరేషన్ చేసి ఓ హుద్రోగికి ఆయుష్షు పోశారు మనపట్టణంలో ప్రముఖ శ్రీదత్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హుద్రోగ నిపుణుల వైద్యబృందం. సుమారు 4 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి విజయంసాధించారు.
ఈ సందర్భంగా శ్రీదత్తా వైద్యశాల అధినేత ప్రముఖ హుద్రోగ నిపుణులు డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ గారు మాట్లాడుతూ పల్నాడు జిల్లా కారంపూడి మండలం అడిగొప్పల నిదానం పాటి లక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రధాన అర్చకులైన ఆర్.విజయరామకుమార్ అనే 52 ఏళ్ళ వయస్సు కలిగిన అతను ఇటీవల తీవ్ర అస్వస్థతకుగురై వైద్యసేవలకోసం పట్టణంలో శ్రీ దత్త వైద్యశాలకు రావడం జరిగింది కాగా సంబంధిత వైద్యులు పరీక్షించి గుండె సమస్య కారణానికి సంబందించిన అన్ని పరీక్షలు చేయటంతో సంబందిత వ్యక్తి గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళాలలో మూడు రక్తనాళాలు మూసుకుపోయి ప్రమాదంలో ఉన్నట్టు నిర్థారణ అయింది.ఈ నేపధ్యంలో సదరు రోగికి బైపాస్ సర్జరీ చేయాలని సలహా ఇవ్వగా బైపాస్ కు అతను అంగీకరించకపోవడంతో స్టెంట్ అమరికకు సిద్ధపడవలసి వచ్చింది. ప్రపంచంలోని పలుదేశాలు ,దేశంలోని కొన్ని నగరాలలో మాత్రమే చేసే అరుదైన ,అత్యంత క్లిష్టతరమైన గుండె ఆపరేషన్ చేయవలసి వచ్చినది. ఐవియుఎస్ స్కానర్ ఆధారిత ప్రక్రియతో గుండె రక్తనాళాల ను స్కానింగ్ చేస్తూ (పల్నాటి ప్రాంతం లో ఇప్పటివరకు జరగని రీతిలో) అత్యంతక్లిష్టతర స్టంట్ అమరికను విజయవంతముగా పూర్తి చేయడము జరిగినది. ముఖ్యంగా ఈ ప్రక్రియ ద్వారా గుండె రక్తనాళాల పరిమాణం మరియు పూడికను విశ్లేషించే అవకాశం ఉంటుంది. మరియు నిశితమైన ప్రక్రియ వలన స్టెంట్ అమరిక సంఖ్య ను తగ్గించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆపరేషన్ అనంతరం రోగి గుండెకు ఎటువంటి రుగ్మతలు దరిచేరకుండా ముందస్తుగా గుర్తించే వీలుంటుందని డాక్టర్ కృష్ణకాంత్ గారు తెలిపారు. ఐదు రోజుల క్రితం ఈ ఆపరేషన్ ను డాక్టర్ గార్లపాటి కృష్ణ కాంత్ , డా. వేణుగోపాలరావు , డా. జ్ఞానేశ్వరి ల నేతృత్వంలోని కార్డియాలజీ వైద్య బృందం 4 గంటల పాటు శ్రమించి విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు. ఆపరేషన్ అనంతరం కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.