శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
నాగర్‌కర్నూలు జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ప్రమాదం జరిగిదంి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఘాట్ రోడ్డులో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని బొల్లారానికి చెందిన నలుగురు వ్యక్తులు శ్రీశైలం దైవదర్శనానికి వెళుతూ ఈ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు వ్యక్తులు కారులో ఉన్నారు. వీరంతా మద్యం తాగి ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా తేల్చారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని శ్రీశైలంలోని సున్నిపెంట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.