శబరిమలైలో తెలంగాణా వాసి మృతి..

శబరిమలైలో తెలంగాణా వాసి మృతి..

కేరళ : రాష్ట్రంలోని శబరిమలై‌లో వరంగల్ వాసి  చరణ్ రెడ్డి మంగళవారం మృతి  చెందారు. అయితే గుండెపోటుతో మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. తొక్కిసలాట సమయంలో ఒక్కసారిగా ఆయన కుప్పకూలి పడిపోయినట్లు చెబుతున్నారు. టేకులగూడెం గ్రామానికి చెందిన చరణ్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నారు. చరణ్ రెడ్డి భార్య మాజీ కార్పొరేటర్‌గా పని చేశారు. చరణ్ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చరణ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గత కొన్ని సంవత్త్సరాలుగా ఆయన శబరిమలై వెళుతున్నారని తెలిపారు.  

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0