"విశాఖ" లో టెన్షన్.. టెన్షన్.. తగ్గేదే లేదంటున్న జేఏసీ..

"విశాఖ" లో టెన్షన్.. టెన్షన్.. తగ్గేదే లేదంటున్న జేఏసీ..

విశాఖ గర్జన ప్రారంభం అయింది. అభివృద్ధి వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని అంటోన్న జేఏసీ శనివారం ఎట్టకేలకు విశాఖ గర్జన కార్యక్రమానికి సిద్ధమయింది.  దీంతో ఒకవైపు విశాఖ గర్జన..మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్యక్రమాలు. ఇంకో వైపు టీడీపీ ఉత్తరాంధ్ర నేతల సమావేశం. దీంతో విశాఖలో టిెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. డాబా గార్డెన్స్‌కు సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి బీచ్‌ రోడ్‌లోని వైస్సార్‌ విగ్రహం వరకు వికేంద్రీకరణకు మద్దతుగా భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికోసం విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని జగన్ ప్రభుత్వం భావించినా అందుకు అన్ని రకాలుగా అడ్డుపడుతుండటంతో విశాఖ గర్జన పేరుతో నిరసన తెలియజేయాలని నిర్ణయించారు.

కాగా, విశాఖ గర్జనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఈ గర్జనకు లక్ష మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. డాబా గర్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్ లోని వైఎస్సార్ విగ్రహం వరకూ ఈ ర్యాలీ కొనసాగనుంది. అయితే విశాఖలో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తుంది. అయినా లెక్క చేయకుండా గర్జనలో పాల్గొనేందుకు తరలి వస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన కళారూపాలను

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0