విజయవాడలో టెన్షన్ టెన్షన్.. ఉద్యోగులు ఎక్కడికక్కడే అరెస్ట్..

 విజయవాడలో టెన్షన్ టెన్షన్.. ఉద్యోగులు  ఎక్కడికక్కడే అరెస్ట్..

విజయవాడ: పీఆర్సీ జీవో లను వ్యతిరేకిస్తూ  పీఆర్సీ సాధన సమితి తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో విజయవాడలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడకు ఎటువంటి అనుమతులు లేవంటూ ఉద్యోగులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పలుచోట్ల గృహనిర్బంధం చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే ఉద్యోగస్థులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రత్యేక పోలీస్ బలగాలని నగరం వెలుపల ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుండి విజయవాడకు వస్తున్న ప్రతి బస్సును, కార్‌ను, టు వీలర్‌ను పోలీసులు ఆపి చెక్ చేస్తున్నారు. ఎంప్లాయిస్ వాట్సాప్ చెక్ చేసి మరీ అరెస్ట్ చేస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్లను సీపీ క్రాంతిరాణా టాటా క్షేత్ర స్ధాయిలో పరిశీలించారు. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0