విజ‌య‌న‌గ‌రం జిల్లాలో భారీ అగ్నిప్ర‌మాదం-30ఇళ్లు ద‌గ్థం..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో భారీ అగ్నిప్ర‌మాదం-30ఇళ్లు ద‌గ్థం..

గ్యాస్ లీక్ అవ్వ‌డంతో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 30ఇళ్లు ద‌గ్ధ‌మ‌య్యాయి..ఈ సంఘ‌ట‌న విజయనగరం జిల్లా మెంటాడ మండలం బక్కువలో జరిగింది. కూరకుల వీధిలో 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు పేలుతుండటంతో సమీప నివాసాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో గ్రామస్థులు భయంతో బయటకు పరుగులు తీస్తున్నారు.స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కోట పొలినాయుడు ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వడంతో అగ్నిప్రమాదం జరిగినట్లు స‌మాచారం. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0