వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం..నేలపాలైన ఉక్కు ద్రవం..రెండు లారీలు దగ్ధం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్-2లో మంటలు చెలరేగాయి. ల్యాడిల్‌కు రంధ్రం పడడంతో ఉక్కుద్రవం నేలపాలైంది. దీంతో ఒక్కసారిగా బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్-2లో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో రెండు లారీలు దగ్దమయ్యాయి. అయితే ఈ ప్రమాదం లో ఎంతమేరకు ఆస్థి నష్టం సంభవించిందో తెలియాల్సి ఉంటుంది. ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
What's Your Reaction?






