రాష్ట్రంలో జులై 15 నాటికి కరోనా తగ్గుముఖం

రాష్ట్రంలో జులై 15 నాటికి కరోనా తగ్గుముఖం

- మే 30 నాటికి 5 వేల కేసులు మాత్రమే నమోదు 

- జులై 15 నాటికి ఏపీలో 100 కేసుల కంటే తక్కువే 

- మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్ తో అంచనా వేసిన ఎస్ఆర్ఎం విద్యార్థులు

అమరావతి, మే 11:  రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులతో బెంబేలెత్తిపోతున్న రాష్ట్ర ప్రజానీకానికి ఏపీ ఎస్ఆర్ఎం ప్రొఫెసర్లు, విద్యార్థులు ఊరట నిచ్చే కబురు మోసుకొచ్చారు. జులై 15 నాటికి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. తాము తయారు చేసిన అంచనాల ప్రకారం జులై 15 నాటికి ఏపీలో రోజుకు 100 కంటే తక్కువ కేసులు నమోదవుతాయని వివరించారు. 
వివరాలు ఈ
విధంగా ఉన్నాయి.

ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రొ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి నారాయణరావు చొరవతో వర్సిటీ ప్రొఫెసర్ సౌమ్యజ్యోతి బిస్వాస్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఫైనలియర్ విద్యార్థులు అన్వేష్ రెడ్డి, అవినాష్రెడ్డి, సాయికృష్ణ, సుహాసిరెడ్డిలు కోవిడ్ వ్యాప్తి ముగింపు కాలాన్ని అంచనా వేస్తూ శాస్త్రీయంగా ఓ నివేదికను తయారు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న ఎస్ఐఆర్ (సస్పెక్టబుల్, ఇన్ఫెక్టెడ్ అండ్ రికవరీ మోడల్)సాయంతో ర్యాండమ్ ఫారెస్ట్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్ డేటాను తయారు చేశారు. ఇది రోగ వ్యాప్తి, వేగం, తీవ్రతతో పాటు రికవరీ వివరాలను
వెల్లడిస్తుంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి గురించి రాష్ట్ర ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ ద్వారా రోజువారీ వెల్లడిస్తోన్న వ్యాధి పీడితులు, కేసులు, రికవరీ డేటాను ఎస్ఎస్ఐఆర్ డేటాతో అనుసంధానం చేయడం వల్ల వ్యాధి వ్యాప్తిపై అంచనా గణాంకాలు
స్పష్టమవుతున్నాయి. ఇదే పద్ధతిని పాటించిన ఎస్ఆర్ఎం విద్యార్థులు మార్చి 3వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలను తాము తయారు చేసిన డేటాను ఉపయోగించి విశ్లేషణ చేయడం ప్రారంభించారు. ఈ విశ్లేషణ ఆధారంగా మే 21 నాటికి ఏపీలో 10 వేల కేసులు, మే 30 నాటికి 5 వేల కేసులు, జూన్ 14 నాటికి 1000 జూన్ నాటికి 500 కేసులు నమోదయ్యే అవకాశముందనీ, జులై 15 నాటికి ఏపీలో 100 కేసుల కంటే తక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని
ఎస్ఆర్ఎం గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎస్ఆర్ఎం విశ్లేషణా బృందం తయారు చేసిన ఈ నివేదికను యూనివర్సిటీ ప్రో వైసన్సలర్ ప్రొఫెసర్ డి నారాయణరావు మంగళవారం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్కు ఈమెయిల్ ద్వారా పంపారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
1
wow
0