రైలు కింద పడి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

రైలు కింద పడి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ : రైలు కిందపడి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పీఎస్‌ పరిధిలో  జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాటేదాన్‌  సాయినగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న శ్రావణ్‌కుమార్‌గౌడ్‌ కుమారుడు రాగిణి రిషిగౌడ్‌(21) డిగ్రీ చదువుతున్నాడు. శుక్రవారం శివరాంపల్లి- బుద్వేల్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0