రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న 87వేల మందికి కరోనా పాజిటివ్

రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న 87వేల మందికి కరోనా పాజిటివ్

కరోనా రెండు డోసులు వేసుకున్నా ఫలితం ఉండటం లేదని తాజా రిపోర్డు వెల్లడిస్తోంది. దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న 87 వేల మందికి కరోనా వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అందులో ఒక్క కేరళలోనే దాదాపు 46 శాతం మంది దాకా ఉన్నారని తెలుస్తోంది. కేరళలో మొదటి డోసు తీసుకున్న 80 వేల మందికి కరోనా సోకగా.. రెండు డోసులు తీసుకున్న 40 వేల మంది దాని బారిన పడ్డారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కేసుల్లో కేరళలోనే అత్యధికంగా వస్తుండడం, ఇప్పుడు బ్రేక్ త్రూ (రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా రావడం) కేసులూ ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదవుతుండడం పట్ల కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళకు చెందిన 200 బ్రేక్ త్రూ కేసుల శాంపిళ్లను జన్యుక్రమ విశ్లేషణ కోసం పంపించారు. అయితే, ఆ శాంపిళ్లలో ఎలాంటి జన్యుపరివర్తన జరిగిన కరోనా మూలాలు లేవని తేల్చారు. కేరళలో బ్రేక్ త్రూ కేసులు పెరిగిపోతుండడంతో.. దాని పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులపైనా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
1
sad
0
wow
0