యువకుడి పొట్టలో సొరకాయ.. ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు

యువకుడి పొట్టలో సొరకాయ.. ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు

తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన యువకుడికి ఎక్స్ రే తీసిన వైద్యులు కడుపులో కనిపించిన వస్తువును చూసి షాకయ్యారు. ఆపై ఆపరేషన్ చేసి దానిని బయటకు తీశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకంగా ఉందని, చికిత్స కొనసాగుతోందని తెలిపారు. 

మధ్యప్రదేశ్‌లోని ఖజురహో ప్రాంతానికి చెందిన యువకుడు భరించలేని కడుపు నొప్పితో బాధపడుతూ చత్తర్‌పూర్ జిల్లా ఆసుపత్రికి వెళ్లాడు. అతడిని పరీక్షించిన వైద్యుడు డాక్టర్ నందకిశోర్ జాదవ్ ఎక్స్ రే తీశారు. కడుపులో అడుగుకు పైగా పొడవున్న సొరకాయ తొడిమ సహా కనిపించడంతో ఆశ్చర్యపోయారు. వెంటనే శస్త్రచికిత్స చేసి దానిని బయటకు తీశారు. 

అతడి కడుపులోకి సొరకాయ ఎలా వెళ్లిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. దాని వల్ల యువకుడి పెద్దపేగు నలిగిపోయిందని వైద్యులు తెలిపారు. బహుశా అది అతడి మలద్వారం ద్వారా వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఎవరైనా దానిని బలవంతంగా చొప్పించారా? అన్నది అతడు స్పృహలోకి వచ్చాక తెలుస్తుందని చెప్పారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోందని, పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందని పేర్కొన్నారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
2
wow
0